Press "Enter" to skip to content

సీతాగొంది అడివిలో శిలాజ శిలలు

సీతాగొంది అడివిలో శిలాజశిలలు:

సీతాగొంది అడివిలోని మేకలగండి గురించి ‘ఈ దట్టమైన అడవిలో పులుల అరుపుల మధ్య తన పరివారం తుపాకులు పేలుస్తూ, పెడబొబ్బలు పెడుతుండగ ఆదిలాబాద్ చేరుకున్నాన’ని ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర లో రాసుకున్నాడు.

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గ్రామం సీతాగొంది ఆదిలాబాద్ నుంచి హైద్రాబాద్ వెళ్ళే జాతీయ రహదారి పక్కన వుంది. మార్గమధ్యంలో కుడివైపు మేకలగండి వద్ద దట్టంగా పర్చుకున్న అడవిలో సున్నపురాతిగుండ్లు వందల సంఖ్యలో కనిపిస్తాయి. కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బి.వేణుగోపాల్ రెడ్డి(ఆదిలాబాద్) వీటిలో కొత్తగా శిలాజాల శిలలను గుర్తించాడు.

దక్కన్లో 6.5కోట్ల సంవత్సరాల కింద సంభవించిన అగ్నిపర్వతం పేలుడువల్ల ప్రవాహించిన లావా చల్లారుతున్నపుడు ఈ నేలంతా పరచుకుని అనేకచోట్ల బసాల్ట్ రాతిదిమ్మెలుగా, రాతిరేకులుగా, రాతిఉండలుగా మారిపోయాయి.

ఈ శిలాజశిలలను వారు పరిశీలించిన అనంతరం జీఎస్సై డిప్యూటీ డైరెక్టర్ జనరల్(రిటైర్డ్) చకిలం వేణుగోపాల్ రావుగారు మాట్లాడుతూ బసాల్ట్ పొరల మధ్యలో అక్కడక్కడ కనిపించేవి సెడిమెంటల్ (ఇంటర్ ట్రాపియన్స్) రూపాలే. ఈ శిలలను ‘మార్ల్’ అంటారు. మేకలగండిలోనివన్నీ ఇంటర్ ట్రాపియన్స్ సెడిమెంట్స్. వీటిలో నత్తగుల్లలు, ఆల్చిప్పలు, ఆకులు, వృక్షభాగాలు వంటివే కాదు  Charophytes, Ostropods మొదలైన సూక్ష్మశిలాజాలు కూడా  విస్తారంగా లభిస్తాయి.  ఇంటర్ ట్రాపియన్ శిలలలో కొన్ని క్లే, మార్ల్, ఛెర్ట్(బ్లాక్, బ్రౌన్), సాండ్ స్టోన్ వంటివి వుంటాయి. తాను మేకలగండి ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు. గుడిహత్నూర్ ప్రాంతం శిలాజ సంపన్నమైనదన్నారు. జియోలజీ ఇండియావారి Pasco (5) Volumesలో మేకలగండి ప్రస్తావన వుంది.

గుడిహత్నూర్ మండలంలో ఇటువంటి శిలారూపాలను చూసానని రిటైర్డ్ హిందూ రిపోర్టర్, జర్నలిస్టు లెజెండ్ హరిపాల్ సింగ్ గారు చెప్పారు.

వీటిని భద్రపరిచి, ఈ ప్రదేశాన్ని జియోగ్రాఫికల్ మోన్యుమెంట్ గా ప్రభుత్వం గుర్తించి, ప్రకటించాలని కొత్తతెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్  విజ్ఞప్తి చేసారు.

క్షేత్రపర్యటన, ఫోటోగ్రఫీ: బి.వేణుగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్,8074209541,  కొత్తతెలంగాణ చరిత్రబృందం, సభ్యుడు

విషయ రచన: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం

విషయ నిపుణులు: చకిలం వేణుగోపాల్ రావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్(రిటైర్డ్), జీఎస్సై.,9866449348, కొత్తతెలంగాణ చరిత్రబృందం

Chakilam Venugopal Namavarapu:

Fossil fragments are clearly seen . They are bivalves probably belonging to genus Unio.

These from the Inter Trappean beds that occur as thin sediments sandwiched between lava flows. Lithologically they are Chert Marl and clay . These rocks locally contain abundant fossils such as Unio ,Physa , Viviparous etc . Plant fossils include remains of Palms , wood and Vegetable debries .

Dr. Yadagiri reported Dinosaur bones from the Inter trapped beds of Ada near Asifabad. The age of these sediments is estimated to be 65 million years.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి