Press "Enter" to skip to content

గుడి హత్నూర్ అడివిలో ప్రాకృతిక శిలా స్తంభాలు

Last updated on September 22, 2021

గుడి హత్నూరు అడివిలో ప్రాకృతిక రాతిస్తంభాలు:

                6లక్షల సం.రాల కింద పేలిన అగ్నిపర్వతపు లావా ప్రవాహించి పరచుకున్న భూభాగమంతా దక్కన్ ద్వీపకల్పభూమిలోనే వుందంటారు భూవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. అట్లా లావా ప్రవహించి చల్లారుతున్న సమయంలో  మధ్యభారతదేశంలో, పశ్చిమభారతదేశంలో అనేకచోట్ల లావా శిలలు వివిధ రూపాలను సంతరించుకున్నాయి. వాటిని ‘కాలమ్నార్ బసాల్ట్’ లంటారు.

                తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ ప్రదేశాలు రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని అనేకచోట్ల భూగర్భంలోంచి బయటకు వచ్చిన ఈ శిలారూపాలు అగుపిస్తుంటాయి. ఎండాకాలంలో పంటచేండ్లలో నెర్రెలువారిన భూమి పంచకోణ, షట్కోణ, అష్టభుజాల ఆకారాలలో కనిపిస్తుంది. ఆ ఆకారాలే లోపలిదాకా విస్తరించి గట్టిపడి కడ్డీలవంటివి ఏర్పడతాయి. అట్లే ఈ లావాశిలారూపాలు పుట్టుకొచ్చి వుంటాయి.

భారతదేశంలో అరేబియన్ సముద్రతీరప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని మాల్పెలో  కొబ్బరిచెట్లద్వీపం, థాన్సెపార్ లలో ‘సెయింట్ మేరీ ద్వీపాలు’గా పిలువబడే 4చిన్నద్వీపాలలో ర్యోలిటిక్ లావా స్తంభరూపాలు గుర్తింపబడ్డాయి. 2016 సం.లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన 34 జాతీయ భూభౌతిక స్మారక కట్టడాలలో ఒకటిగా చేర్చబడ్డవి సెయింట్ మేరీ ద్వీపాలు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి భూభౌతిక రూపాలు ప్రత్యేకంగా జియో టూరిజం కేంద్రాలుగా ఏర్పాటు చేయబడ్డాయి.

తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరు మండలంలోని రిజర్వ్ ఫారెస్టులో ‘బసాల్ట్ శిలా స్తంభరూపాలు’ విస్తారంగా కనిపించాయని మా కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు మన్నె ఏలియా తెలియజేస్తున్నారు.

ఈ శిలారూపాలను చరిత్రబృందంలోని చకిలం వేణుగోపాల్, జీఎస్సై (రిటైర్డ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తెలంగాణాలో ఇటువంటి శిలారూపాలు కనిపించడం తొలిసారని చెప్పారు. అపురూపమైన వీటిని పరిరక్షించి స్మారక కట్టడంగా ప్రకటించాలని చరిత్రబృందం ప్రభుత్వాన్ని కోరుతున్నది.

Chakilam Venugopal Namavarapu: At places columnar besalts developed in the process of cooling of lava .

Certain places the columns are developed deeply forming a unique pattern .At St Mary’s island near Bombay these are declared as national geological monument.

The C B are known from many places in western and central India .

Location of C B are noticed for the first time in Telangana

Preservation of them with proper protection and maintenance will go a long way in conservation of geological heritage

The thick pile of Volcanic flows widely spread in the West coast and Deccan plateau,are commonly known as Deccan Traps .

These D T spread as thin sheets of basic lava erupted from fissures ,occur as flat toped mountains all over the stats of Maharashtra , parts of MP Gujarat Karnataka Telangana etc .Towards the west and central part of the Deccan main mass the flows are thick and rapidly erupted .On the southern margin and eastern fringes they are  less in number and not rapidly erupted allowed the formation of inter trappeans.

These lava flows at places developed polygonal cracks at the stage of solidification and these cracks vertically extended forming interlocking columns are eventually exposed to weathering resulting in to uniquely patterned columnar patterns to the area .

These columnar Basalt appear sometimes as manmade features due to the impossing columnar patterns .

In India such C b s are known to occur many places like At St Mary’s island ,Andheri,Kolhapur etc .The CB of st Maris Island was declared as national geological monument

The southeastern margin of Deccan Traps extend to Telangana all along Maharashtra border, Columnar Basalt are however not known in this area .

The recorded CB from Adilabad appears to be a new record .world wide they are protected as monuments ex Devils Tower Wayomi USA

Turkey also protected this kind of columns as monument .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *